తెలంగాణ హైకోర్టులో తొలిసారిగా తెలుగులో తీర్పు

-

తెలంగాణ హైకోర్టు మరో చరిత్ర సృష్టించింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించి హిస్టరీ క్రియేట్ చేసింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీలుపై సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఇటీవల తెలుగులో 44 పేజీల తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఆంగ్ల భాషలోనే వ్యవహారాలుంటాయి.

పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ పత్రాలు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు వెలువరించింది.

తెలుగులో తీర్పు వెలువరించడం ద్వారా జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం ఇలా  తెలుగులో వెలువరించామని తీర్పు చివరిలో ధర్మాసనం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news