‘నాటో’లోకి ఇండియా.. మోదీ టూర్​కు ముందు అమెరికా ప్లాన్!

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్​ను నాటో ప్లస్ కూటమిలో చేర్చుకోవాలని అమెరికా ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్​లోని అత్యంత శక్తిమంతమైన కమిటీ ఈ సిఫార్సు చేసింది. భారత్​ చేరడం వల్ల నాటో ప్లస్ బలపడుతుందని పేర్కొంది. ‘అమెరికా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య వ్యూహాత్మక పోటీ’పై ఏర్పాటు చేసిన హౌస్ సెలెక్ట్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదించింది. తైవాన్​ భద్రత సహా, ‘నాటో ప్లస్’ బలోపేతం కోసం భారత్​ను భాగస్వామిగా చేసుకోవాలని ఈ కమిటీ స్పష్టం చేసింది.

“తైవాన్ భద్రతా డిమాండ్లను తీర్చడం.. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో వ్యూహాత్మక పోటీలో విజయం సాధించడం.. ఈ రెండూ జరగాలంటే మిత్రపక్షాలు, భాగస్వాములతో అమెరికా తన సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. ఒకవేళ తైవాన్​పై చైనా దాడి చేస్తే.. జీ7, నాటో, నాటో ప్లస్, క్వాడ్ కూటములు ఏకతాటిపైకి వచ్చి డ్రాగన్ దేశంపై ఆంక్షలు పటిష్ఠంగా అమలు అయ్యేలా చూడొచ్చు. చైనాపై ఆంక్షలు విధించే విషయంలో ‘2023 స్టాండ్ విత్ తైవాన్ యాక్ట్’ తరహా చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలి.” – కాంగ్రెస్ కమిటీ సిఫార్సులు

Read more RELATED
Recommended to you

Latest news