నా లైఫ్​లో ఇంత నిరుత్సాహపరిచే వీడియో ఎన్నడు చూడలేదు : ఆనంద్ మహీంద్రా

-

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలు, క్రీడలు, సినిమాలు.. ఇలా అన్ని రంగాలపై తరచూ పోస్టులు పెడుతుంటారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో తనకు నచ్చిన వీడియోలు పోస్టు చేసి వాటి గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఆయన షేర్ చేసే సందేశాలు వినోదాత్మకంగా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని పంచుతాయి. తాజాగా షేర్ చేసిన వీడియో క్లిప్‌ ఆకట్టుకుంటోంది.

‘ఈ వీడియో క్లిప్ నా వద్దకు పలుమార్లు వచ్చింది. ఆధునిక ప్రపంచంలో రైలు ప్రయాణంలో ఉన్న సౌకర్యాలను వెల్లడిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయాణాన్ని విలాసవంతంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ఎన్ని ఉత్పత్తులు ఉన్నాయో కనిపిస్తోంది. నా జీవితంలో వ్యక్తిగతంగా ఇంతగా నిరుత్సాహపరిచే వీడియో ఎన్నడూ చూడలేదు. ఆధునిక జీవన విధానంలో అనవసర వస్తువుల అతివినియోగాన్ని ఇది చూపిస్తోంది. అవి భూగ్రహంపై ఉన్న చెత్తగుట్టల పరిణామాన్ని మరింత పెంచుతాయి’ అని మహీంద్రా ఆందోళన వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news