ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలిసిందే..తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కొద్ది నిమిషాల క్రితమే తుదిశ్వాస విడిచారు.. గత కొన్నిరోజులుగా సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు..
హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందారు.. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.. ఆయన మృతి పై సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు.. ఆయన నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి జనాల్లో మంచి ఆదరణ పొందాడు. ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తండ్రిగా, అలాగే కొన్ని సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. దాదాపు 8సార్లు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డులో సైతం అందుకున్నారు. ఈయన ఇండస్ట్రీకి రాకముందు పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికీ ఆయన ఉన్న కంటి సమస్య కారణంగా పోలీస్ ఆఫీసర్ కాలేకపోయారు.
ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు.. తన తండ్రి వ్యాపారం చూసుకోమంటే తనకి వ్యాపారం చేయడం నచ్చక సినిమాలపై ఇష్టం పెరిగి ఇండస్ట్రీలోకి రావాలని తల్లి ప్రోత్సహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి శరత్ బాబు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే శరత్ బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు… ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని ఆయన ఇంటికి తరలించానున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..