అర్నబ్‌ గోస్వామి వాట్స్‌యాప్‌ చాట్‌ తో దొరికిపోయారా

-

టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల కేసులో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి పేరు బయటకొచ్చింది. ప్రధాన నిందితుడు దాస్‌గుప్తాతో అర్నబ్‌ జరిపిన వాట్స్‌యాప్‌ చాట్‌ ఆధారంగా సప్లిమెంటరీ చార్జీషీట్‌ వేశారు. ప్రధాని కార్యాలయంతో సంబంధాల్ని అర్నబ్‌ దుర్వినియోగం చేసినట్టు ఆరోపించారు. కానీ… విచిత్రంగా ఈ కేసులో అర్నబ్‌ను నిందితుల జాబితాలో చేర్చలేదు ముంబై పోలీసులు.

టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల స్కామ్‌లో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి పేరు బయటకొచ్చింది. బార్క్‌ మాజీ సీఈవో పార్ధో దాస్‌గుప్తాతో అర్నబ్‌ వాట్స్‌యాప్‌లో జరిపిన సంభాషణలను ముంబై పోలీసులు బయటపెట్టారు. … రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడైన పార్థో దాస్‌ గుప్తా… గతంలో బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ – బార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేశారు. దీంతో రేటింగ్స్‌ మోసాలు ఎలా చేయవచ్చనే విషయంపై దాస్‌ గుప్తాతో అర్నబ్‌ చాలా సార్లు చర్చించారని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేశారు. మొత్తం 3 వేల 400 పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్‌లో వెయ్యికి పైగా పేజీలు అర్నబ్‌-దాస్‌గుప్తాల చాటింగ్‌ మెసేజిలకు సంబంధించినవే ఉన్నాయి.

ప్రధాని కార్యాలయం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలతో కూడా అర్నబ్‌కు సంబంధాలున్నాయని చార్జిషీట్‌లో తెలిపారు పోలీసులు. దానిని అర్నబ్‌ దుర్వినియోగం చేసినట్టు ఆరోపించారు. చార్జిషీట్‌లో అర్నబ్‌ గోస్వామి ప్రస్తావన ఉన్నా…విచిత్రంగా అన్ని నిందితుల జాబితాలో చేర్చలేదు ముంబై పోలీసులు. గత ఏడాది డిసెంబర్‌లో దాస్‌గుప్తాను అరెస్ట్‌ చేసినప్పుడు రిపబ్లిక్‌ టీవీకి చెందిన టీఆర్పీలను పెంచుకోడానికి అతను లక్షలాది రూపాయలు లంచాలిచ్చాడని ఆరోపించారు. మరోవైపు… అర్నబ్‌ గోస్వామికి బాలకోట్‌ వైమానిక దాడితో పాటు ఆర్టికట్‌ 370 రద్దుకు సంబంధించి ముందే తెలుసంటున్నారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వంతో అతనికి గల సన్నిహిత సంబంధాలే దీనికి కారణంగా చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news