రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

-

ఇండియా కూటమి కలిసి ఉన్నట్టు మన కంటికి కనిపించదు అని కామెంట్ చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ తాజాగా మరోసారి రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్  అంధకారం అవుతుందని.. 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాలలో పాత పార్టీ ఉండబోదని విలేకరుల సమావేశంలో హిమంత బిస్వా అన్నారు. గత ఒకటిన్నర నెలల్లో చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడారు. ఇదే కాంగ్రెస్ క్షీణతకు ఉదాహరణ అని అన్నారు.


2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని నేను నమ్ముతున్నాను. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 2025 ప్రథమార్థంలో బీజేపీలో చేరతారని శర్మ చెప్పారు. నేను భూపేన్ కుమార్ బోరా కోసం రెండు సీట్లు సిద్ధం చేసాను. కాంగ్రెస్ లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరతారు. నేను సోనిత్పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా బీజేపీలోకి చేరుతారు. కానీ అది వద్దు. ఇప్పుడు అస్సాం మన చేతుల్లో ఉంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది.. అవసరమైనప్పుడు తీసుకోవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news