మహారాష్ట్రలో దారుణం..మంత్రగత్తె అనే అనుమానంతో మహిళను వివస్త్రను చేసి ఊరేగింపు..

మహారాష్ట్రలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది.మంత్రగత్తె అనే అనుమానంతో ఓ మహిళను వివస్త్రను చేసి నగరంలో ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నందుర్ బార్ జిల్లా లో ఓ మహిళ మంత్రవిద్య చేస్తుందని స్థానికులు అనుమానించారు.దీంతో విచక్షణ మరిచిన స్థానికులు ఆ మహిళను వివస్త్రను చేసి నడి వీధుల్లో ఊరేగించారు.ఈ ఘటనను కొందరు తమ కెమెరాలలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోనుఈ వీడియో ను పరిగణలోకి తీసుకున్న మహారాష్ట్ర అందశ్రద్ధ నిర్మూలన్ సమితి (MANS) విచారణ జరపాల్సిందిగా నందుర్ బార్ లోని జిల్లా అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించింది.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అందశ్రద్ధ నిర్మూలన్ సమితి ప్రతినిధి తెలిపారు.ఈ ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి అంటూ కొందరు మండిపడుతున్నారు.ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.