BREAKING : సుప్రీంకోర్టులో వరవరరావుకు బెయిల్ మంజూరు

-

సుప్రీంకోర్టులో వరవరరావుకు ఉపశమనం కలిగింది. అనారోగ్యం, వయస్సు , మధ్యంతర బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం ఆధారంగా శాశ్వత బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వరవర రావు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ ఉదయ్ లలిత్ నేత్రుత్వంలోని ధర్మాసనం విచారించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ కోరుతూ వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు.

వరవర రావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ…బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది అడిషినల్ సొలిసిటర్ జనరల్. అనారోగ్యం సమస్యలు, వయస్సు, పార్కిన్ సన్ తో బాధపడటం తో పాటు ఇతర సమస్యలు వున్నాయని కోర్టు ద్రుష్టికి వరవరరావు తరఫు న్యాయవాది గ్రోవర్ తెచ్చారు. వరవరరావుపై నమోదైన ఎన్ఐఎ కేసులు విచారణకు ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా 15 ఏళ్ళు అని బదులిచార్రు అదనపు సొలిసిటర్ జనరల్.

అనారోగ్య సమస్యలు, 82 ఏళ్ళ వయస్సులో ఇప్పటికే రెండున్నర ఏళ్ళు జైలులో వుండటం, ఆరు నెలల మధ్యంతర బెయిల్ సమయంలో దుర్వినియోగంకు పాల్పడలేదన్న అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం సహా అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్నామన్న ధర్మాసనం వాదోపవాదాల అనంతరం బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. శాశ్వత బెయిల్ మంజూరుతో పాటు కొన్ని నిబంధనలు విధించింది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news