ఉరేసుకుంటానంటున్న అల్లుడు..  గొంతు కోసుకుంటానంటున్న అత్త ! 

-

  • బెంగాల్‌లో ర‌స‌వత్త‌రంగా మారుతున్న రాజ‌కీయాలు 
  • బీజేపీ వ‌ర్సెస్ తృణ‌ముల్‌..
  • నువ్వా నేనా? అంటూ పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్న నేతలు 

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న కొద్ది బెంగాల్‌లో రాజ‌కీయాలు ర‌వ‌స‌త్త‌రంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా బెంగాల్ బీజేపీ, తృణ‌ముల్ కాంగ్రెస్‌లో నువ్వా నేనా అనే రీతిలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా ఇరు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మ‌రో వైపు అధికార తృణ‌ముల్ స‌హా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల కూట‌మి సైతం తీవ్ర ‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముందుకు దూసుకుపోతున్నాయి.

మొత్తంగా బీజేపీ, అధికార తృణ‌ముల్ మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం రాజ‌కీయంగా హీటును పెంచుతోంది.  నేతాజీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ రెండు పార్టీల నేత‌ల ఒక‌రిపపై ఒక‌రు చేసుకున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇటీవ‌ల బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తాజాగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు  చేశారు.  త‌న గొంతు అయిన కోసుకుంటాను  కానీ బీజేపీ ముందు మాత్రం లత‌ల‌వంచ‌ను అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేతాజీ జ‌యంతి స‌భ‌లో జై శ్రీ‌రామ్ నినాదాలు చేయ‌డం.. బెంగాల్‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని బీజేపీ కౌంట‌ర్ ఇచ్చారు.  జై శ్రీ‌రామ్ కు బ‌దులు నేతాజీని ఉద్దేశించి నినాద‌లు చేసివుంటే త‌ను వాళ్ల‌కు సెల్యూట్ చేసేదానిని అంటూ పేర్కొన్నారు.

ఇందిలా ఉండ‌గా సీఎం మ‌మ‌తా అల్లుడు అభిషేక్ బెన‌ర్జీ బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను బ‌లంగానే తిప్పికొడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న పై క‌మ‌ళం నేత‌లు చేస్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ గ‌ట్టి స‌వాల్ విసిరారు.  త‌న‌పై చేస్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ నాయ‌కులు నిరూపిస్తే.. బ‌హిరంగంగా  తాను ఉరేసుకుంటాన‌ని అభిషేక్ బెన‌ర్జీ సంచల‌‌న వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబ రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్న బీజేపీ.. ద‌మ్ముంటే ఒక కుటుంబం నుంచి ఒక్క‌రే రాజ‌కీయాల్లో ఉండే విధంగా చ‌ట్టం చేయాలంటూ స‌వాలు విసిరారు. అలా చేస్తే తాను రాజ‌కీయాల‌ను నుంచి త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే, బీజేపీ లీడ‌ర్లు రాజ్‌నాథ్ సింగ్‌, కైలాష్ విజ‌య వ‌ర్గీయ‌, ముకుల్ రాయ్‌, సువేందు అధికారి వంటి క‌మ‌ళం నేత‌ల కుటుంబాలు రాజ‌కీయాల్లో ఉన్నాయంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news