దేశంలో మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన తండ్రికి టికెట్ ఇవ్వద్దంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూతురు నిరసనలు తెలిపింది. దీంతో అక్కడ పొలిటికల్ వాతావరణం హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టికెట్ ఇవ్వవద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్టానానికే అల్టీమేటం ఇచ్చింది. ఒకవేళ టికెట్ ఇస్తే.. తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టికెట్ ఆశావాహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టికెట్ ఇవ్వకూడదని కోరారు. దీంతో వీరి వ్యవహారం రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.