ఎన్డీఏలోకి నీతీశ్ కుమార్.. బిహార్లో మళ్లీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు!

-

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి. బిహార్‌లో బీజేపీ మద్దతుతో 2 రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారనీ అందులో ఒకటి సుశీల్‌ మోదీ అని తెలుస్తోంది. జనవరి 28వ తేదీన తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని సమాచారం. ఆ రోజు పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.

సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ విషయంలో నీతీశ్‌ అసంతృప్తిగా ఉన్నారనీ.. హస్తంతో సీట్ల సర్దుబాటుపై అసహనంతో ఉన్నారని సమాచారం. ఈ 3 పార్టీలు గతేడాది ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములని తెలిసిందే.  బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు భారతరత్న ప్రకటించిన దగ్గరినుంచి జేడీయూ, ఆర్జేడీల మధ్య ఉన్న చీలికలు బయటపడిన విషయం తెలిసిందే. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌, ఆర్జేడీని ఉద్దేశిస్తూ చురకలు వేయడంతో ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివారం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news