బీహార్ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిజెపి తో తెగ తెంపులు చేసుకున్న జెడియు, ఆర్జెడి, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సీఎం నితీష్ కుమార్. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ని కలవనున్నారు నితీష్. బీహార్ లో దోస్తీ పై అవగాహనకు వచ్చిన జెడియు, ఆర్జెడి ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాన అభ్యర్థి నితీష్ కుమార్ కు మద్దతు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ అంగీకరించినట్లు సమాచారం.
ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ అంగీకారం తెలిపారట. తనకు తెలియకుండా తన పార్టీ ఎంపీకి కేంద్రమంత్రి పదవి ఇవ్వడం సహా ఇతర పరిణామాలతో బీజేపీకి దూరంగా ఉంటున్న సీఎం నితీష్ కుమార్.. ఇవాళ జేడీయు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అవుతున్నారు. జెడియు, ఆర్జెడి, కాంగ్రెస్.. మొత్తం 243 స్థానాలు ఉండగా.. ఆర్జెడి 79, బిజెపి 77, జెడియు 45, కాంగ్రెస్ 19 స్థానాలు ఉన్నాయి. అయితే బిజెపితో తెగదెంపులు చేసుకొని ఆర్జెడి, జెడియు, కాంగ్రెస్ లతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.