నారీమణి : బ్రిటిష్ వారికే చుక్కలు చూపించిన భారతీయ మహిళలు..!

-

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతోంది . ఇక ఈ స్వాతంత్ర్యం తెచ్చుకోవడం వెనుక మగవారు మాత్రమే కాదు ఎంతోమంది భారతీయ మహిళలు కూడా తమ వంతు కృషి చేశారు.. నారీ శక్తులు గా మారి బ్రిటిష్ వారికి చుక్కలు చూపించడమే కాకుండా వారి గుండెల్లో దడ పుట్టించి మన దేశాన్ని విడిచి పారిపోయేలా చేశారు. ముఖ్యంగా ప్రతి మగాడి విజయం వెనుక మహిళ పాత్ర ఉన్నట్టుగానే దేశానికి స్వాతంత్రం రావడానికి కూడా ఎంతోమంది వీర మహిళల ప్రాణ త్యాగం కూడా ఉంది. ఇక అలాంటివారి గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి:A Woman To Remember: The Queen Of Jhansi, Rani Lakshmi Baiవీరత్వానికి మరో పేరుగా మనం చెప్పుకుంటాము.. ముఖ్యంగా ఝాన్సీ రాణి అంటేనే గుండెలు ఒప్పొంగే అంత ధైర్యం మనకు వస్తుంది. ఇక ఈమె ఏ స్థాయిలో బ్రిటిష్ వారిపై పోరాడి ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళలలో మొదటి స్థానంలో నిలిచారు ఝాన్సీ లక్ష్మీబాయి . భయం అనే పదానికి చోటే లేకుండా ఒంటరిగా బ్రిటీష్ సైన్యంతో పోరాడింది. భర్త మరణం తర్వాత కూడా కుమారుడ్ని రాజుని చేయడానికి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ఏకైక మాతృమూర్తి అని చెప్పవచ్చు. ఇక ఝాన్సీ రాణి వీరోచితంగా పోరాడి మరణించిన తర్వాత ఈమె మరణం ఎంతో మంది ఆడవారికి స్ఫూర్తిదాయకంగా మారింది. ఇక ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతోమంది ఆడవారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.

కిత్తూరు రాణి చెన్నమ్మ:Way Before Laxmi Bai, This Warrior Queen Fought & Defeated the British
భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొంతమంది తొలి భారతీయ మహిళా పాలకులలో ఈమె కూడా ఒకరు. భర్త, కుమారుడు మరణించిన తర్వాత రాజ్య బాధ్యతను స్వీకరించిన ఈమె బ్రిటిష్ పాలకులను తన రాజ్యం వైపు కన్నెత్తకుండా కాపాడుకుంది. అంతేకాదు తన సైన్యానికి నాయకత్వం వహించి. యుద్ధ రంగంలో బ్రిటిష్ పాలకులతో ధైర్యంగా పోరాడి చివరికి యుద్ధభూమిలోనే ప్రాణాలను అర్పించింది. ఈమె ధైర్య సాహసాలను వెలుగులోకి తీసుకురావడానికి కర్ణాటకలోని అనేక పాఠ్యాంశాలలో ఈమె గురించి చెప్పడం గమనార్హం.

సరోజినీ నాయుడు:Celebrating 'Swar Kokila' Sarojini Naidu on her 143rd birth anniversary | NewsBytes
ముఖ్యంగా క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది సరోజినీ నాయుడు. ఇక స్వతంత్ర కవయిత్రి స్వాతంత్రం కోసం జైలు శిక్ష కూడా అనుభవించింది. అనేక నగరాలకు వెళ్లి మహిళా సాధికారత , సామాజిక సంక్షేమం మరియు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత గురించి మహిళల్లో చైతన్యం నింపింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈమె కన్నుమూశారు. ఇకపోతే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించిన రెండవ మహిళ కావడం గమనార్హం. ముఖ్యంగా ఈమె చేసిన పోరాటం ప్రతి రాష్ట్రంలో స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చబడింది. వీరితోపాటు మరి ఎంతో మంది మహిళలు స్వాతంత్రం కోసం పోరాడి చివరికి యుద్ధ రంగంలోనే కన్నుమూయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news