వారు బిర్యానీ తినడంతోనే బర్డ్‌ఫ్లూ వచ్చిందా..?

-

దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో నూతన సంవత్సరంలో నూతన వ్యాధితో మరిన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే రాజస్థాన్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌çఫ్లూ వ్యాధి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో తగు చర్యలు తీసుకుంటున్నారు. దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన మూలంగానే దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ విస్తరించేందుకు అవకాశం ఉందని ఓ భాజపా నేత అంటున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిరసనకారులు నిత్యం చికెన్‌ బిర్యానీలు తింటున్నారని, దీంతో వ్యాధి మరింత వ్యాప్తి చెందొచ్చని రాజస్థాన్‌లోని రామ్‌గంజ్‌మండి నియోజకవర్గ ఎమ్మెల్యే ‘మదన్‌ దిలావర్‌’ అంటున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినబడుతుంది.

 

‘ప్రతిరోజు వారు బిర్యానీ తింటూ హాయిగా ఉంటున్నారు. తమ అవతరాన్ని తరచూ మారుస్తున్నారు. వారిలో చాలా మంది దోపీడీదారులు ఉండొచ్చు, ఉగ్రవాదులు ఉండొచ్చు, ప్రభుత్వం వారిని అక్కడి నుంచి తొలగించకపోతే దేశమంతా బర్డ్‌ఫ్లూ సోకే అవకాశం ఉంది’ అని దిలావర్‌ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

రాజస్థాన్‌ పాఠశాల విద్య పర్యాటక దేవదాయ శాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ దొతాస్రా కూడా ఈ వీడియో గురించి తన ట్విటర్‌లో ప్రస్తావించారు. రైతుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు పడాల్సిన విషయమని.. దేశానికే అన్నం పెట్టే వారిని బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చేస్తున్నారటాన్ని ఆయన తప్పు పట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version