అన్నాడీఎంకే ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అయితే శశికళ తో భేటీ అయ్యారు తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి. ఈ రహస్య భేటీ శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తీరుతాం అన్న ధీమా వ్యక్తం చేశారు శశికళ. అలాగే అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వం,కో- కన్వీనర్ పళనిస్వామి మధ్య సాగుతున్న అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.
ఇందుకు తగ్గట్టుగా ఆ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయానికి అవకాశమే లేదని కూడా శశికళ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బిజెపి పేదలకు దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ తో చెన్నైలో బీజేపీ నేత విజయశాంతి భేటీ కావడం ప్రాధాన్యతకు దారితీసింది. రహస్యంగా ఈ భేటీ జరిగినట్టు శశికళ శిబిరం వర్గాల ద్వారా శనివారం వెలుగులోకి వచ్చింది.