గోల్డెన్ టెంపుల్ వద్ద మరో పేలుడు.. ఆరు రోజుల్లో ఇది మూడో ఘటన

-

పంజాబ్​లోని అమృతసర్​లో వరుస పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు భారీ పేలుళ్లు జరిగి చాలా మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం సమీపంలోనే మూడో సారి భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు శబ్దాలతో స్వర్ణ దేవాలయం ప్రాంతం దద్దరిల్లింది. శ్రీ గురు రామ్‌దాస్ నివాస్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై పోలీస్​ కమిషనర్​ నౌనిహాల్​ సింగ్​ స్పందించారు. “అర్ధరాత్రి 12.15-12.30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. ఇది మరో పేలుడు ఘటన. భవనం సమీపంలో శిథిలాలను కనుగొన్నాం. ఘటనపై పూర్తి విచారణ జరుగుతోంది” అని ఆయన చెప్పారు. అయితే వరుస పేలుళ్ల ఘటనలతో ప్రజలు కాస్త భయపడుతున్నారు. అసలేం జరుగుతుందో తెలియక భయంభయంగా గడుపుతున్నారు. ఆరు రోజుల వ్యవధిలో మూడు ఘటనలు జరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news