ఒడిశా రైలు ప్రమాదం అప్డేట్.. ఆ ఐదుగురి పాత్రపై సీబీఐ ఆరా

-

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేయిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఓవైపు స్థానిక పోలీసులు.. మరోవైపు కేంద్ర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా ఈ ప్రమాదంలో ఐదుగురు రైల్వే ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరిగినప్పుడు విధులు నిర్వర్తించిన బహానగాబజార్‌ స్టేషన్‌ మాస్టర్‌, మరో నలుగురు సిగ్నలింగ్‌ సిబ్బంది వీరిలో ఉన్నారు.

ప్రస్తుతం వీరంతా యథావిధిగా పని చేసుకుంటున్నారని, త్వరలోనే రాబోతున్న ‘రైల్వే భద్రత కమిషనర్‌’ (సీఆర్‌ఎస్‌) విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. సిగ్నల్‌ వ్యవస్థలో ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా మార్పు చేశారా? లేదా పొరపాటున జరిగిందా? ఆ ప్రాంతంలో అప్పటికే జరుగుతున్న వేరే నిర్వహణ పనుల వల్ల సిగ్నల్‌ మారిందా?.. ఈ మూడు అంశాలపై ప్రధానంగా సీబీఐ విచారణ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news