వాట్సాప్ లో కొత్త ఫీచర్స్.. స్క్రీన్ షేరింగుతో పాటు ఎన్నో..!

-

ఈరోజులలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు వాట్సాప్ ను ఉపయోగించడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది సులభంగా మనం మీడియాని షేర్ చేసుకోవచ్చు. మెసేజ్లని కూడా సులభంగా పంపించుకోవచ్చు అయితే వాట్సాప్ రోజు రోజుకు కొత్త ఫీచర్లని తీసుకువస్తూనే ఉంది ఈ ఫీచర్లు యూజర్ లోకి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఫీచర్లతో యూజర్లకి మరింత ఈజీ అవుతుంది. తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్ జోడించింది వాటికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దీనివల్ల యూజర్లు ప్రొఫైల్ కు ప్రత్యేకంగా యూజర్ నేమ్ ని యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ని కూడా వాట్సాప్ తీసుకు రానుంది. వాట్సాప్ కొత్త స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది ఈ ఫీచర్ తో కాల్ సమయంలో వినియోగదారులు ఫోన్ స్క్రీన్ ని షేర్ చేయొచ్చు. అంతేకాదు వాట్సాప్ యూజర్లు ఈ కొత్త ఫీచర్ తో కాల్ కంట్రోల్ వ్యూలో ప్రత్యేక సింబల్ ద్వారా వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ లని షేర్ చేసుకుంటారు. ఎలా అయితే మనం గూగుల్ మీట్ జూమ్ యాప్ ని ఉపయోగిస్తాము అలా వాట్సాప్ లో కూడా ఇక మీదట వాడుకునే విధంగా తీసుకువస్తుంది వాట్సాప్.

అలానే ఆర్చీవ్ అనే కొత్త ఫీచర్ ని కూడా తీసుకురాబోతోంది వ్యాపారులు అంతకంటే ముందు పోస్ట్ చేసిన స్టేటస్ అప్డేట్లని కస్టమర్లు చూసేలా షేర్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ ని మరింత మందికి తీసుకురాబోతోంది వాట్సాప్. అదే విధంగా సొంత విండోస్ యాప్ కోసం కొత్త అప్డేట్ ని తీసుకు రాబోతోంది. యాప్ లాంగ్వేజ్ మెసేజ్ డ్రాఫ్ట్ ఫిల్టర్ లని మార్చడంలో యూజర్లకి ఇది సహాయం చేస్తుంది.

పెండింగ్ లో ఉన్న చాట్లని త్వరగా కనుకునేందుకు ఈ ఫీచర్ బాగా ఫిల్టర్ చాట్ అనే ఆప్షన్ ని తీసుకు రానుంది. అలానే కొత్త ఛానల్స్ ని కనుగొనే ఫీచర్ ని కూడా తీసుకురాబోతుంది. అదే విధంగా త్వరలో వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్ కి సంబంధించిన నెంబర్లు కనపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలని కూడా అందించేందుకు వాట్సప్ చూస్తోంది ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లకి వారి ఫోన్ నెంబర్లను దాచుకునే అవకాశం ఉంటుంది ఇలా భవిష్యత్తులో వాట్సాప్ ఈ ఫీచర్లని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news