వ్యవసాయ మోటార్లకు మీటర్లపై వెనక్కి తగ్గిన కేంద్రం

వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని అంశంపై… అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనుక అడుగు వేసింది. గత సంవత్సరం విద్యుత్ చట్ట సవరణ పేర్కొన్న ఆ నిబంధనలను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు లెక్కించానని సూచించింది.

అలాగే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్ పంపిణీ సంస్థ ల డి లైసెన్సింగ్ నిబంధనలను పక్కన పెట్టింది. విద్యుత్ రంగ ప్రవేటీకరణ లక్ష్యంతో గత సంవత్సరం రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులు కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.