అందరిచూపు చంద్రబాబు, నీతీశ్‌ల వైపే.. ఎన్డీయేలో వీళ్లే కీలకం

-

కేంద్రంలో బీజేపీ 240 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి 293 సీట్లలో విజయం సాధించింది. అయితే ఈ కూటమి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌ కుమార్‌లు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో కీలకం కానున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడటం తప్పనిసరి అవుతోంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలుచేస్తుంది.

చంద్రబాబు, నీతీశ్‌లు గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చారు. తిరిగి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే మళ్లీ కూటమితో జతకట్టారు. అలా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, బిహార్​లో జేడీయూ, బీజేపీ లాభపడ్డాయి. ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news