అయోధ్యను సందర్శించనున్న 11 మంది సీఎంలు

దేశంలోని 11 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం అయోధ్యను సందర్శించి శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రులు పంచ్‌శీల్ హోటల్‌లో బస చేయనున్నారు. మధ్యాహ్నం సమయంలో రామ్ కి పైడికి వెళ్లనున్నారు.

అయోధ్యను సందర్శించే వారిలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, హర్యానా, గోవాల ముఖ్యమంత్రులతోపాటు బిహార్, అరునాచల్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం మధ్యాహ్నం సమయంలో అయోధ్యకు చేరుకుని ప్రార్థనలు చేయనున్నారు.