క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ థాయిలాండ్ లో అరెస్ట్ అయ్యాడు. థాయిలాండ్ లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ముఠాలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే గ్యాంబ్లింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ అయిన వారిలో చీకటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి నుంచి భారీగా నగదు తో పాటు 20 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ లభించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురుని కూడా చికోటి ప్రవీణ్ అక్కడికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.