గుండెలనిండా దుఃఖంతో చైతన్య ఆత్మహత్య పై స్పందించిన కండక్టర్ ఝాన్సి !

-

ఈటీవి లో ప్రసారం అవుతున్న ఢీ అనే డ్యాన్స్ షో లో కోరియోగ్రఫీ చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయిన చైతన్య మాస్టర్ ఇవాళ ఉదయం నెల్లూర్ క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై స్నేహితులు మరియు తోటి డ్యాన్సర్ లు స్పందిస్తున్నారు. తాజాగా గాజువాక కండక్టర్ మరియు డ్యాన్సర్ అయిన ఝాన్సి గుండెల నిండా కొండంత దుఃఖంతో తన బాధను తెలిపారు. చైతన్య అన్నయ్య ఇంత పని చేస్తారనుకొలేదు . అప్పులే సమస్య అయితే… లోకంలో చాలా మందికి ఉన్నాయి అంతమాత్రానికి చావే సమాధానం అనుకుంటే ఎలా అంటూ బాధను వర్ణించారు.

ఒకసారి అవతలి వారితో నేను మీరు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను అని అర్థమయ్యేలా చెప్పుంటే ఇంత జరిగేది కాదేమో అన్నది ఝాన్సి. ఈ విషయం పట్ల చాలామంది బాధపడుతున్నారు. ఎంతో హ్యాపీ గా షోస్ చేసుకుంటూ వెళ్తున్న చైతన్య అంతలోనే చనిపోవడంతో ఎందరికో షాక్ తగిలింది. తనతో పని చేసిన ఎందరో అతనిని మార్గదర్శకంగా తీసుకునేలా కోరియోగ్రఫీ లో తన నైపుణ్యాన్ని చూపిస్తూ వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news