భారత్ చైనా సరిహద్దుల్లోని పాంగోంగ్ త్సో సరస్సు దక్షిణ ఒడ్డున చైనా సైన్యం తాజా ఉల్లంఘనలకు పాల్పడిన సంగతి విదితమే. దీనికంటే కొన్ని రోజుల ముందు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క వైమానిక దళం తన J-20 ఐదవ తరం యుద్ధ విమానాలను లడఖ్ సమీపంలో మోహరించింది. అవి ఇంకా ఇప్పటికి అక్కడే ఉన్నాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అవి ఇంకా అక్కడ ఎగురుతున్నాయని పేర్కొన్నారు.
ఆగష్టు 29-30 మధ్య రాత్రి, భారత సైన్యం చైనా దళాల కదలికను గమనించి, లడఖ్ ప్రాంతంలోని చుషుల్ కు తూర్పున ఉన్న పాంగోంగ్ త్సో సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున కొత్త ప్రాంతాల్లోకి అడుగు పెట్టాలనే వ్యూహాన్ని అడ్డుకుంది. భారత ఆర్మీ కూడా భారీ యుద్ద విమానాలను సరిహద్దుల్లో మోహరించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది అని ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.