ఇవాళ ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీకి ఏపి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. నిన్న రాత్రి 10.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ ఉదయం 10.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడి తో ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ రాత్రి
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్న ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ లను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో కూడా ఏపి సి.ఎమ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.