ఒకే కుటుంబం నుంచి 16 మంది సైన్యానికి రావడం దేశానికి ఆదర్శం: ప్రధాని

-

దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్​పేయి వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు నరేంద్ర మోడీ. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్​ స్ఫూర్తితోనే కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా ఈ సమయంలో సమిష్టిగా దేశం పోరాడుతుందని , అన్ని దేశాలతో మైత్రి ని పెంచుకుంటూ పోతుందని అన్నారు. దశాబ్దాలుగా వేల సంఖ్యలో కన్నడ యువకులు భారతీయ త్రివిధ దళాల్లో పనిచేశారు. చేస్తున్నారు కూడా. అందుకే ‘మార్చ్‌ ఆఫ్‌ ఏ ఫుట్‌ సోల్జర్‌’ పుస్తక రచయిత, విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ డీకే హవనూర్‌ ‘సైన్యంలో ప్రత్యేకంగా కర్ణాటక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయవచ్చు’ అంటారు.

solider
solider

సైన్యంతో ఇంతగా బంధం పెనవేసుకుపోయిన ఈ రాష్ట్రంలోని బెళగావి జిల్లా ఇంచల గ్రామానికి చెందిన బాగెవాడి కుటుంబం ప్రత్యేకమైంది. 160 సభ్యులున్న ఈ ఉమ్మడి కుటుంబంలో 16 మందికి సైన్యంతో సుదీర్ఘ అనుబంధముంది. వీరిలో తొమ్మిది మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన వారు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. 1977లో బాగెవాడి కుటుంబానికి చెందిన రుద్రప్ప తొలిసారిగా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి వారసులంతా ఆయన బాటలోనే నడిచారు. ఈ కుటుంబం వలె దేశమంతా శత్రు దేశాల నుంచి రక్షణ విభాగంలో ముందుండి నడిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news