మోడీజీ జీడీపీలో బ్రహ్మాండమైన వృద్ధిని తీసుకొచ్చారు !

-

  •  కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు

న్యూఢిల్లీః దేశ ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి.. బీజేపీ నేతృత్వంలోని మోడీ స‌ర్కారు జీడీపీలో బ్ర‌హ్మండ‌మైన వృద్ధిని తీసుకొచ్చిందూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తాజాగా రాహుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజీల్ (జీడీపీ అని పేర్కొంటూ) ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతూ వాహ‌న‌దారుల న‌డ్డి విరుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో పాటు ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌నీ, ఇదే స‌మ‌యంలో మోడీ స‌ర్కారు ప‌న్ను వ‌సూళ్లలో బీజీగా ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.

గ‌త వారం రోజుల్లో వ‌రుస‌గా నాలుగు రోజులు దేశంలో చ‌మురు ధ‌ర‌లు పెరిగి.. ఆల్ టైమ్ రికార్డు గ‌రిష్ట స్థాయిల‌ను తాకాయి. నిత్య‌వ‌సరాల ధ‌ర‌లు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాహుల్ స్పందిస్తూ.. కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “మోడీ జీ GDPలో విపరీతమైన వృద్ధిని తీసుకొచ్చారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ” అని ఒక ట్వీట్ చేశారు. అలాగే, “ప్రజలు ద్రవ్యోల్బణం కారణంగా బాధపడుతున్నారు, అయితే మోడీ ప్రభుత్వం పన్ను వసూళ్లలో బిజీగా ఉంది” అని కూడా రాహుల్ ఆరోపించారు.

వివిధ వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన చ‌మురు ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ ణానికి సంబంధించిన పేప‌ర్ క‌ట్టింగ్స్ ను కూడా పోస్టు చేశారు. కాగా, చమురు ధరల పెరుగుదల తో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70, ముంబైలో రూ.92.28కు చేరింది. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.75.88కు, ముంబైలో లీటర్ కు రూ.82.66కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news