ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉన్నా కూడా రాజకీయ పార్టీలు తరుచూ ఇద్దులాడుకుంటూనే ఉంటాయి.ఒకరి వాదనకు మించి మరో వాదన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్నదే ముఖ్యం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా సమస్యలున్నాయి. వాటిపై మత ప్రభావం కన్నా కుల ప్రభావం కన్నా వీటికి అతీతం అయిన ఆర్థిక ప్రభావం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కానీ లేదా గుజరాత్ అల్లర్లకు సంబంధించి కానీ ఇంకా రావాల్సిన విషయాలు ఏవీ వెలుగులోకి రాలేదన్న భావన ఒకటి ఇవాళ వ్యక్తీకరణలో ఉంది.
ఇదే సమయంలో మోడీ లాంటి నాయకులు కల్లోలిత సంబంధ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను తీసుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. ఈ దశలో ఓ సినిమా వచ్చి సంచలనం రేపుతోంది. ఈ సినిమా చుట్టూనే ఇవాళ రాజకీయం నడుస్తోంది. ఎప్పుడో జరిగిన ఘటనలే కావొచ్చు వాటి విషయమై బీజేపీ ఆ రోజు ఎంత బాధ్యత వహించింది లేదా ఎంతగా సమర్థనీయ ధోరణిలో పనిచేసింది అన్నది ఇప్పుడొక ప్రామాణికం కావాలి. ఇప్పుడే కాదు కాలాలకు అతీతంగా ప్రభుత్వాల పనితీరు అన్నది ప్రామాణికం కావాలి.కశ్మీర్ ఫైల్స్ విషయమై కూడా రగులుతున్న రగడకు కారణం ఇదే!
ఈ దశలో బీజేపీ మరియు బీజేపీయేతర పార్టీలు ఒకే ఒక్క వివాదం పై మాట్లాడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాపై మాట్లాడుతున్నాయి. కల్లోల కశ్మీరు తీరం చుట్టూ కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో మత వాద రాజకీయ వ్యాఖ్యలు వినిపించి పబ్బం గడుపుకోవడంలో మోడీ ముందుంటున్నారన్నది సీపీఎం వాదన. ఈ సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సున్నిత అంశాల జోలికి పోకుండా మోడీ రాజకీయం చేయరు అన్నది నిర్వివాదాంశం అని అంటోంది సీపీఎం.వీటిపై బీజేపీ చెప్పే మాటలు కన్నా విపక్షం వివరిస్తున్న సందర్భాలే ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ సరే మరి! దేశాన్ని కదిపి కుదిపేసిన గోద్రా ఘటనలకు సంబంధించి గోద్రా ఫైల్స్ ఎప్పుడు అన్న వాదన ఒకటి వినిపిస్తోంది సీపీఎం. ఇదే సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కదిపికుదిపేస్తున్న రాజధాని అమరావతికి సంబంధించి కూడా మరో వాదన వినిపిస్తోంది. అమరావతి ఫైల్స్ పేరిట ఓ చిత్రం రానుందని తెలుస్తోంది.
కశ్మీర్ పండితుల విషాదం – కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బీజేపీ రాజకీయం..ఇదీ సీపీఎం చెబుతున్న మాట. గత కొద్ది రోజులుగా కశ్మీర్ ఫైల్స్ సినిమా అనేక వివాదాలకు తావిస్తోంది. అస్సలు ఇది సినిమానే కాదని తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ నిన్నటి వేళ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కొన్ని బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఒక సినిమా తీసి తద్వారా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేయడం నిజంగానే హాస్యాస్పదం అని అంటున్నాయి.ఇదే రీతిలో చాలా ప్రజా సంఘాల నాయకులు కూడా స్పందిస్తున్నారు.ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ భావోద్వేగ రాజకీయాలు నడపడంలో బీజేపీ ప్రథమ స్థానంలో ఉందని కూడా అంటున్నారు.
– 2014 నుండి బీజేపీ పాలనలో ఉంది. నేటికీ 8 ఏళ్ళు. కశ్మీర్ పండితులను ఎందుకు న్యాయం చేయలేకపోతుంది?
– ఆర్టికల్ 370 రద్దు నాలుగేళ్లు అయిపోతుంది. కశ్మీరీ పండిట్ల జీవితాలలో ఎందుకు మార్పురాలేదు?
– కశ్మీర్ పండితులను తిరిగి కాశ్మీర్ లోయకు బీజేపీ ఎందుకు తీసుకెళ్లలేకపోయింది?
– కశ్మీర్ పండితులను అన్యాయం చేసిన దుర్మార్గులను ఎందుకు శిక్షించలేకపోయింది?
– కశ్మీర్ పండితులు పూర్తి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితి బీజేపీ ఎందుకు తీసుకోలేకపోయింది?
– అప్పట్లో అటల్ బిహారి ప్రభుత్వం ఆరేళ్ళు పాలించింది.
– తీవ్రవాదుల దాడుల తర్వాత పండితులకు రక్షణ కల్పించేందుకు బదులు బీజేపీకి చెందిన గవర్నర్ జగ్‌మోహన్.. వీరందరికీ జమ్మూలో పునరావాసం కల్పించలేదు?
– “కశ్మీరీ హిందూ కుటుంబాలను పునరావాసం కల్పించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?
– లోయ నుంచి నిర్వాసితులై కశ్మీరీ పండితులను ప్రస్తుతం నివాస ధ్రువీకరణ పత్రం కూడా బీజేపీ ఎందుకు ఇవ్వలేకపోతోంది?
– కశ్మీర్ ఫైల్స్ సినిమా కి ట్యాక్స్ తగ్గిస్తే కశ్మీరీ పండితుల సమస్య తీరుతుందా?
– హిందువుల కోసం బీజేపీ పని చేస్తుందంటూ వారి సమస్యలు పరిష్కరించకుండా..కశ్మీర్ ఓట్ల కోసం కేవలం ఓట్ల రాజకీయం చేయడం దుర్మార్గం కాదా? మోసం చేయడం కాదా?
– బీజేపీ దేశంలో హిందూ, ముస్లింల మధ్య విభజనను సృష్టించి కశ్మీరీ పండిట్ల సమస్యపై ఎన్నికల్లో లబ్ధి పొందాలని నకిలీ ఆగ్రహావేశాలను పెంచడానికే కశ్మీ ర్ ఫైల్స్ ను రాజకీయంగా వాడుకుంటోంది…అని సీపీఎం ఆరోపిస్తోంది.