రాజధానిలో కరోనా భీభత్సం.. 5 వేలకు చేరువలో మరణాలు..!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 4,473 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,269కి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవాళ 33 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు కరోనాతో మొత్తం 4,839 మంది మరణించారు. ప్రస్తుతం 30,914 యాక్టివ్‌ కరోనా కేసులుండగా.. ఇప్పటివరకు 1,94,516 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.