బిపోర్​జాయ్‌ తుపాను ఎఫెక్ట్.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు.. కాసేపట్లో మోదీ రివ్యూ

-

అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన బిపోర్​జాయ్‌ తుపాను.. అతి తీవ్రంగా మారి గుజరాత్‌ వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను మరో 36 గంటల్లో మరింత బలపడి.. గుజరాత్‌లోని కచ్‌, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గుజరాత్ సర్కార్ అప్రమత్తమైంది. గుజరాత్‌ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా కారణంగా జూన్ 15 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్​లలోకి తరలిస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 1,300 మంది తరలించినట్లు తెలిపారు.

మరోవైపు బిపోర్‌జాయ్‌ తుపానుపై.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమీక్షలో తుపాను ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news