IPL 2023 : ఐపీఎల్ చరిత్రలో దీపక్ చాహర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో CSK బౌలర్ దీపక్ చాహర్ 3వ స్థానంలో నిలిచారు. దీపక్ ఇప్పటివరకు పవర్ ప్లేలో 53 వికెట్లు పడగొట్టగా… పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు SRH బౌలర్ భువనేశ్వర్ కుమార్ (61) పేరిట ఉంది.
భువి తర్వాత వరుసగా సందీప్ శర్మ (55), దీపక్ చాహార్ (53), ఉమేష్ యాదవ్ (53), జహీర్ ఖాన్ (52) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT చేదించలేకపోయింది. గిల్ 42, రషీద్ 30 రన్స్ తో రాణించిన GT 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. సీఎస్కే బౌలర్లలో చాహార్, తీక్షణ, జడేజా, పతిరన తలో 2 వికెట్లు, తుషార్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవడంతో చెన్నై ఫైనల్ కు చేరగా, ఎలిమినేటర్ లో గెలిచే జట్టుతో GT క్వాలిఫైయర్-2 లో తలపడనుంది.