ప్రైవేట్ పార్ట్స్.. సందర్భానుసారంగా వాటి అర్థం మారుతుంది : ముంబై కోర్టు

-

మానవ శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ అనే వాటికి సమాజంలో సందర్భానుసారంగా అర్థం మారుతుందని.. ఆ సమయంలోని ఏ అవయవాన్ని తాకినా ప్రైవేట్ పార్ట్స్‌గా నిర్ధారించడం జరుగుతుందని ముంబై కోర్టు అభిప్రాయపడింది. 2017లో జరిగిన ఓ ఘటనలో ఓ పదేళ్ల బాలిక సమీపంలోని దుకాణానికి వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్తుంది. అప్పుడు స్టేషనరీ బయట నలుగురు అబ్బాయిలు కూర్చున్నారు. ఆ నలుగురు అబ్బాయిలు బాలికను చూసి నవ్వారు. దీంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. కొద్ది సేపటి తర్వాత తన స్నేహితురాలితో ఆలయానికి వెళ్లింది. షాపు వద్ద చూసిన కుర్రాళ్లే అక్కడ కనిపించారు. నలుగురిలో ఓ అబ్బాయి ఆమె దగ్గరికి వచ్చి తన ప్రైవేట్ పార్ట్‌ని టచ్ చేశాడు. దీంతో ఆ ముగ్గురు స్నేహితులు నవ్వారని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.

sexual harassment
sexual harassment

ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో.. తండ్రి ఇంటికి చేరుకున్నాడు. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ను తాకినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సవార్ అలీ షేక్ వైపు చూపించింది. అది గమనించి అలీ షేక్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని అలీ షేక్‌ను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బాధితురాలి తరఫున న్యాయవాది సుల్భా జోషి మాట్లాడుతూ.. నిందితుడు బాలికను ఉద్దేశపూర్వకంగానే ప్రైవేట్ పార్ట్‌ను తాకినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడమే కాకుండా.. అవమానించారని తెలిపింది. షేక్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. బాధితురాలి తల్లి తన భర్తకు కాల్ చేసి తమ కుమార్తెను ఎవరో టీసింగ్ చేసినట్లు పేర్కొంది. టీసింగ్‌కి హత్తుకోవడానికి మధ్య వ్యత్యాసం ఉందన్నారు.

న్యాయమూర్తి ఎంఏ బరాలియా మాట్లాడుతూ.. ఒక అమ్మాయి పిరుదులను తాకడం లైంగిక ఉద్దేశం లేకుండా చెప్పలేమని పేర్కొన్నారు. “నిందితుడు తన ప్రైవేట్ భాగాన్ని తాకినట్లు బాధితురాలు తన తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిపింది. పదేళ్ల వయసు బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం, ఉద్దేశ పూర్వకమేనని తెలిపారు. నిందితుడు బాలికను చూసి నవ్వి.. తన ప్రైవేట్ పార్ట్‌ను టచ్ చేయడం ఉద్దేశ పూర్వకమేనని న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం పిల్లల రక్షణ చట్టం (పోక్సో) లైంగిక వేధింపులకు పాల్పడిని వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news