కాలుష్య కోరల్లో దిల్లీ.. 50% మందికి వర్క్ ఫ్రం హోం

-

దేశ రాజధాని దిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ మహానగరాన్ని దట్టమైన కలుషిత వాయువు, పొగ కమ్మేసింది. వాయు నాణ్యత తీవ్రంగా పడిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇవాళ శనివారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AIQ) 431గా నమోదైంది. ఇక రాజధాని ప్రాతంలో ఉన్న ధిర్పూర్‌లో అత్యధికంగా ఏఐక్యూ 534గా ఉండగా నోయిడాలో 529, గురుగ్రామ్‌లో 478 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా దిల్లీలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు మూసివేసింది అక్కడి సర్కార్. కాలుష్య తీవ్రతను తగ్గించడంపై ఫోకస్ పెట్టిన దిల్లీ ప్రభుత్వం.. సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయనుంది. ఇదే విధానాన్ని ప్రైవేటు సంస్థలు కూడా పాటించాలని ప్రభుత్వం సూచించింది. వీటితో పాటు దిల్లీలో మార్కెట్లు, ఆఫీసుల పనివేళల సమయం తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news