Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్థం

-

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. జామియా నగర్ లో ప్రాంతంలోని ఎలక్ట్రిక్ మోటర్ పార్కింగ్ లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. 11 ఫైర్ ఇంజిన్ల సహాయంలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా ఈ- రిక్షాలు దెబ్బతిన్నాయి. మొత్తం 10 కార్లు, 1 మోటార్ సైకిల్, 2 స్కూటీలు, 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి.

అయితే ఆగి ఉన్న ఈ- వేహికిల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో పార్కింగ్ లో ఉన్న ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇటీవల కాలంలో దేశ రాజధానిలో వరసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితం ఢిల్లీ ముండ్కాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మొత్తం 20కి పైగా మంది ప్రజలు అగ్నికి ఆహుతి అయ్యారు. తాజాగా జామియా నగర్ లో ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news