చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులివ్వలేం.. తేల్చి చెప్పిన దిల్లీ హైకోర్టు

-

చాట్​జీపీటీ ఆధారంగా తీర్పునివ్వలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి- కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని పేర్కొంది. వ్యాపార చిహ్న నిబంధనలను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. విలాసవంతమైన చెప్పులు, బూట్లు తయారుచేసే ‘క్రిస్చన్‌ లూబటన్‌’ దాఖలు చేసిన ఓ కేసులో ఇటీవల జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పు వెలువరించారు.

తమ వ్యాపార చిహ్నంపై, దాని ప్రతిష్ఠపై చాట్‌జీపీటీ ఏం చెబుతోందో చూడాలని సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ప్రశ్న ఏ తీరులో ఉందనే దానిని బట్టి, చాట్‌బాట్‌ సమాధానాలుంటాయని.. అవి తప్పయ్యే అవకాశాలూ లేకపోలేదని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషనర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని పేర్కొంది. పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశిస్తూ.. పిటిషనర్‌తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. దానిని అతిక్రమిస్తే రూ.25 లక్షల పపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news