అగ్నిపథ్​ పథకంపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

కేంద్ర ప్రభుత్వం సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రయోజనాల కోసమే అగ్నిపథ్‌ పథకాన్ని తెచ్చారని సమర్థించింది.  ఈ పథకం ద్వారా సైనిక బలగాలు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

అగ్నిపథ్‌ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని దిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పాత ప్రకటనల ద్వారా నియామక ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్లను కూడా తోసిపుచ్చింది. అలాంటి అభ్యర్థులు సైన్యంలో ఉద్యోగాలు పొందేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది. దిల్లీ హైకోర్టు డిసెంబర్​ 15న ఈ పిటిషన్​పై తీర్పును రిజర్వ్​లో ఉంచగా.. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్​ సతీస్​ చంద్ర శర్మ, జస్టిస్​ సుబ్రమణియం ప్రసాద్​లతో కూడిన ఈ ధర్మాసనం ఇవాళ దీనిపై దాఖలైన పిటిషన్​లన్నింటిని కొట్టివేసింది. గతంలో ఈ అగ్నిపథ్​ పథకంపై దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్​ను విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news