ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో నిందితుడు అయిన విజయ నాయక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో తన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మే నెలకు వాయిదా వేయడం పట్ల సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు విజయ్ నాయర్. విజయ్ నాయర్ తరపు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో నవంబర్ లో బెయిల్ వచ్చిందని, ఈడి కేసులో ఫిబ్రవరి లో ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించిందని, హైకోర్టు ను ఆశ్రయిస్తే మే నెలకు వాయిదా వేయడంతో బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యం అవుతుందన్నారు సింగ్వి. దీంతో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి న్యాయమూర్తి త్వరగా విచరణ జరిపేలా లిస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.