స్టూడెంట్స్ విష‌యంలో మోదీ త‌ప్పుచేశారా?

-

మూస పాల‌న‌, అగ్రెసీవ్ నిర్ణ‌యాల బాట ప‌ట్టాల‌న్న న‌వ‌త‌రం ఆలోచ‌నల‌తో వున్న భావ‌తావ‌నికి పెద్ద దిక్కుగా క‌నిపించిన అత్యంత ప్ర‌శావ‌శీల రాజ‌కీయ నేత న‌రేంద్ర మోదీ‌. 2014లో అనూహ్యంగా బీజేపీ కి నూత‌న జ‌వ‌స‌త్వాల్ని అందించి దేశ వ్యాప్తంగా బీజేపీ హ‌వానీ చూపించి ప్ర‌ధారినిపీఠాన్ని అధిరోహించారు మోదీ. ఆ త‌రువాత త‌న క్యాడ‌ర్‌ని కీల‌క శాఖ‌ల్లో బ‌లోపేతం చేసుకుంటూ త‌న మార్కుకు శ్రీ‌కారం చుట్టారు. విప్ల‌వాత్మ‌క మార్పులు మోదీ వల్లే సాధ్య‌మ‌ని దేశ వ్యాప్తంగా అంతా బ‌లంగా విశ్వ‌సించారు. ఆ త‌రువాత అంచెలంచ‌లుగా త‌న పంథాకు ప‌దును పెట్టారు. అలా ప్ర‌పంచంలోనే  అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాయకులలో ఒక‌ర‌య్యారు.

అత్యంత ప్ర‌భావ‌శీల నేత‌గా జ‌న బాహుల్యంలోనూ, ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న దేశాధినేత‌ల్లోనూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ చ‌రిష్మా చూసిన వాళ్లంతా ఇది నిజ‌మా క‌లా అనుకునేంత‌గా ఎదిగిపోయారు.  వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అతని అన్ని హ్యాండిల్స్‌లో లక్షలాది మంది చందాదారులు ఉన్నారు.  ఎందుకంటే అతను తన ఆకర్షణీయమైన ఉపన్యాసాలకు ప్రసిద్ది చెందాడు. మోడీ ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రధాన స్రవంతి సైట్‌లలో మాత్రమే కాకుండా, డిస్కవరీ నెట్‌వర్క్ స్టంబ్లూపన్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్, విజువల్ సోషల్ నెట్‌వర్క్ పిన్‌టెస్ట్, బ్లాగింగ్ సైట్ టంబ్లర్ మరియు స్థానిక భాషా సోషల్ నెట్‌వర్క్ షేర్‌చాట్‌లో కూడా ఉంది.

ఇంత‌టి ప్ర‌భావ‌శీల నేత యువ‌త‌లో మాత్రం త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతుండ‌టం దేశ వ్యాప్తంగా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  క‌రోనా మ‌హమ్మారి నేపథ్యంలో జెఇఇ / నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  అయితే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగాలని కోర్టు ఆదేశించింది దీంతో యువ‌త‌లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జాసామ్య వాదులు సైతం ఈ నిర్ణ‌యాన్ని బాహాటంగానే త‌ప్పుప‌ట్టారు. మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కు యువ‌త క్ర‌మ క్ర‌మంగా దూరం అయ్యే అవ‌కాశాలు అధికంగా క‌నిపిస్తున్నాయి. 68వ మ‌న్‌కీ బాత్‌ని ఇటీవ‌ల మోదీ వ్య‌క్త‌గా యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇది అత్యంత డిస్ లైక్‌లు పొందిన వీడియోగా రికార్డు సాధించింది. దీన్నే ప్రామాణికంగా తీసుకుని మోదీపై యువ‌త ఆగ్ర‌హంతో వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అయితే ఇది ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న డిజిట‌ల్ ప్ర‌చార మ‌ని బీజేపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఆగ‌స్టు 30 త‌రువాత నుంచి పీఎం మోదీకి చెందిన ప‌లు సోష‌ల్ అకౌంట్‌ల‌కు సంబంధించిన వీడియోల‌దీ ఇదే ప‌రిస్థితి. ప్ర‌స్తుతం దేశంలో  నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌స్థ‌ల్ని నిర్మించాల్సిన ప్ర‌ధాని ఇలా విరుద్ధంగా ఎక్జామ్స్‌ని నిర్వ‌హించాల‌ని కార‌కండీగా చెప్ప‌డం ఏంట‌ని దేశ వ్యాప్తంగా వున్న యువ‌త ప్ర‌శ్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news