ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు, తీర్మానాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కొత్త రెవెన్యూ బిల్లు, డాక్టర్ ల పదవి విరమణ వయసు పెంపు బిల్లు,పీవీ నరసింహారావు కు భారత రత్న తీర్మానంతో పాటు దాదాపు 20 అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్ర్ ల కోసం ప్రైవేట్ స్థలాల్లో పైప్ లైన్స్ వేయడానికి అనుమతి నిస్తూ చట్ట సవరణ చేయనున్నారు.
17 సంచార జాతులను బీసీ కులాల జాబితాలోకి తేనున్నారు. కరోన నేపథ్యంలో జిఎస్టీ లలో కేంద్రం తెచ్చిన మార్పులకనుగుణంగా తెలంగాణ జిఎస్టీలో మార్పులకు ఆమోదం తెలపనున్నారు. గత అసెంబ్లీ అయిపోయాక ప్రభుత్వం నాలుగు ఆర్డినెన్సులు తెచ్చింది. ఆ బిల్స్ పై చర్చ జరగనుంది. ఇరిగేషన్ శాఖ పేరు జల వనరుల శాఖ గా మార్చడం అలానే ఇరిగేషన్ లోని డిపార్ట్ మెంట్స్ అన్నింటినీ ఒకే డిపార్ట్ మెంట్ కిందకు తీసుకొస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.