ట్విట్టర్ లోకి డోనాల్డ్ ట్రంప్ రీఎంట్రీ.. నెట్టింట ట్రెండింగ్!

-

క్యాపిటల్ హిల్ భవనంపై దాడి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ సంస్థ నూతన అధిపతి ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ తిరిగి ట్విట్టర్ లో యాక్టివ్ కావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. వేలకొద్దీ ట్వీట్లు చేయడంతో ట్విట్టర్ ట్రెండింగ్ లో ట్రంప్ పేరు మారుమోగుతుంది.

అయితే ఇందులో విమర్శలే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో ట్రంప్ కు సంబంధించిన మీమ్స్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ట్రంప్ ను ట్విట్టర్ లోకి అనుమతించాలా? వద్దా? అనే అంశంపై పోలు నిర్వహించగా మెజారిటీ నెటిజెన్లు ఆయనకు అనుకూలంగా ఓటేశారు. పోల్ తర్వాత ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ ఆదివారం వెల్లడించారు. ట్రంప్ అకౌంట్ పై మస్క్ చేసిన పోల్ లో 15 మిలియన్ల మంది యూజర్లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news