ఎన్టీఏ ప్రభుత్వం తమ రాష్ట్ర పతి అభ్యర్థిని నిన్న సాయంత్రం ప్రకటించింది. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము ను తమ రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రకటించింది ఎన్టీఏ సర్కార్. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై ఓ కమిటీ వేసిన బీజేపీ పార్టీ.. ఈ అంశంపై నిన్న కీలక మోడీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్శహించారు.
ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్న బీజేపీ పార్టీ అధిష్టానం.. ఈ మేరకు తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును నిలబెడుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారిక ప్రకటన చేశారు.