సెకండ్ వేవ్ ఎఫెక్ట్: కోల్ కతాలోని దుర్గా విగ్రహాల తయారీదారుల దీనగాథ.. 

-

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను దెబ్బకొట్టింది. పనులు లేక ఆర్థికంగా చితికిపోయి తినడానికి తిండిలేని పరిస్థితులను కరోనా తీసుకువచ్చింది. మొదటి వేవ్ తో కరోనా అయిపోయిందనుకుని ఊపిరి తీసుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. హఠాత్తుగా వచ్చి పంజా విసిరి ఎంతో మంది బతుకులను కడ తేర్చింది. అప్పటికే కుదైలైన ఆర్థిక వ్యవ్వస్థను పాతాళంలోకి పడేసింది. సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.

చాలీచాలని డబ్బుల్తో జీవితాన్ని సాగిస్తున్నారు. కోల్ కతాలోని దుర్గా విగ్రహాల తయారీదారుల పరిస్థితి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. సెకండ్ వేవ్ కారణంగా దుర్గా నవరాత్రులు అనుకున్నట్టుగా అవుతాయా అన్నదానిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. విగ్రహాల తయారీమీద ఆధారపడి జీవించే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. సెకండ్ వేవ్ ఇలాగే కొనసాగితే తమ వ్యాపారం చతికిలపడుతుందని బాధపడుతున్నారు.

సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను చిన్నగా తయారు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి రావడంలో చాలా నష్టపోయారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందన్న భయం ఎక్కువవుతుంది. దానికి కారణం, అసలు ఇప్పటివరకు అడ్వాన్సులు రాకపోవడం. సాధారణంగా ఈపాటికే విగ్రహాల అడ్వాన్సులు రావాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అడ్వాన్సులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

కోల్ కతాలోని బరాసత్ పాటర్స్ కాలనీలో విగ్రహాల తయారీ ఎక్కువగా ఉంటుంది. ఇదే వారి జీవనాధారం. కరోనా విజృంభిస్తుండడంతో అమ్మకాలు ఉంటాయా అన్న సందేహం పెరుగుతూ వస్తుంది. ఈ పరిస్థితి గణపతి విగ్రహాల తయారీదారులకు ఎదురవుతుంది. గత సంవత్సరం విగ్రహ తయారీదారులు చాలా నష్టపోయారు. మరి వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news