కొన్నిసార్లు చిన్నతప్పులే.. పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయి.. నిజానికి అవి చూసేవారికి, చేసినవారికి అస్సలు తప్పులానే అనిపించవు..కానీ రూల్ ప్రకారం చూస్తే..అది క్షమించరాని నేరంగా మిగిలిపోతుంది.. రాష్ట్రపతి కాలుమొక్కినందుకు విధుల నుంచి సస్పండ్ చేయడం మీరు ఎప్పుడైనూ చూశారా..? ఇక్కడ అదే జరిగింది.. రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్‌ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది.
జనవరి 4న రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జరిగిన స్కౌట్ గైడ్ ఆరంభోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.. హెలీక్యాప్టర్ దిగి వస్తుండగా.. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియన్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అంబ సియోల్ రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సదరు జూనియర్ ఇంజనీర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన నేరం కింద ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలీప్యాడ్ వద్ద హెలీక్యాప్టర్ దిగి వస్తుండగా.. ప్రథమ పౌరురాలికి స్వాగతం పలికేందుకు వెళ్లిన స్థానిక నేతలు, అధికారుల బృందంలో ఒకరిగా ఉన్న జూనియర్ ఇంజనీర్ అంబ సియోల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించింది.. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో ఉంది.. అంబ సియోల్ చర్యను తేలిగ్గా తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడి నుంచి తన కోసం వేచిచూస్తున్న వాహనం వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.
రాష్ట్రపతి సెక్యురిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘిస్తూ ఒక ఉద్యోగి రాష్ట్రపతికి అతి దగ్గరగా వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ చేపట్టి జనవరి 12న సస్పెన్షన్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంబ సియోల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాజస్థాన్ ప్రభుత్వం.. తక్షణమే ఆమెను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఆ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పాపం ఆమె చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష పడింది..!!