బిజెపి చేతుల్లో ఫేస్బుక్…?

-

ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ- ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, ధ్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా. అమెరికన్ మీడియా ఈ నిజాన్ని బయటపెట్టిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఒక కథనం ఆయన ప్రస్తావించారు.

rahul-gandhi

వాస్తవానికి ఆ కథనంలో వాల్ స్ట్రీట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని మండిపడింది. విద్వేషా ప్రసంగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ ఉద్యోగులకు చెప్పిన ఫేస్బుక్ అధినేత, హిందుత్వ వాదం విషయంలో మాత్రం చాలా వరకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news