కాంగ్రెస్ పార్టీకి..అగ్రనేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోనియాకు లేఖ రాసిన ఆజాద్.. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆజాద్ వెల్లడించారు.
అయితే.. పోయే వాడు పోక… కాంగ్రెస్ పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై బాంబ్ పేల్చి వెళ్లారు గులాంనబీ ఆజాద్. హుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిందని గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సంప్రదింపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ చురకలు అంటించారు గులాంనబీ ఆజాద్.రాహుల్ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి రాజకీయ పరి పక్వత లేదని విమర్శలు చేశారు.
"Unfortunately after entry of Shri Rahul Gandhi into politics & particularly after January 2013 when he was appointed as VP by you, the entire consultative mechanism which existed earlier was demolished by him," says GN Azad in his resignation letter to Sonia Gandhi pic.twitter.com/20mbQsscSZ
— ANI (@ANI) August 26, 2022