నేటి బంగారం, వెండి ధరలు..!

-

బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న కాస్త పైకి కదిలినప్పటికీ.. నేడు దిగొచ్చింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 30 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,290 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 40 తగ్గడంతో రూ. 48,850 కు చేరుకుంది. కాగా, బంగారం ధర తగ్గుతుంటే.. వెండి ధర మంత్రం పైకి కదిలింది.

gold

కేజీ వెండి ధర రూ. 890 పెరిగింది. దీంతో ధర రూ. 68,100 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 40 మేర పెరగడంతో రూ.54,160 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 కి చేరింది. ఇకపోతే అంతర్జాతీయంగా బంగారం ధర 1934 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 26.99 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news