దిగొచ్చిన బంగారం.. షాకిచ్చిన వెండి..!

-

బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న కాస్త పైకి కదిలినప్పటికీ.. నేడు దిగొచ్చింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 550 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,720 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 510 తగ్గడంతో రూ. 49,240 కు చేరుకుంది.

కాగా, బంగారం ధర తగ్గుతుంటే.. వెండి ధర మంత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ. 800 పెరిగింది. దీంతో ధర రూ. 66,300 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 760 మేర తగ్గడంతో రూ.54,440 చేరుకుంది. అలాగే రూ.700 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కి దిగొచ్చింది. ఇకపోతే అంతర్జాతీయంగా బంగారం ధర 1973 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 27.59 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news