తక్షణమే ఆ కంటెంట్‌ను తొలగించమన్న ప్రభుత్వం!

-

ట్వీట్టర్, ఫేస్‌బుక్‌లలో కొవిడ్‌పై ప్రజలను భయాందోళనలకు గురిచేసే కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కే ంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటి పల్ల ప్రజల్లో తప్పుడు ప్రచారం జరిగి, వారు మరింత భయపడే పరిస్థితి ఏర్పడుతుందని సూచించింది. దీనికి స్పందించిన ట్విట్టర్‌ ఇప్పటికే సదరు ఖాతాదారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కానీ, సదరు అకౌంట్‌ హోల్డర్ల వివరాలు చెప్పలేమని అన్నది. కానీ, వీటివల్ల కోవిడ్‌ విలయతాండవంపై మరింత భయభ్రాంతులకు ప్రజలు లోనయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం భారత్‌లో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఈ వివాదం చెలరేగింది. ప్రతిరోజు కే సులు పెరుగుతున్నాయి. శనివారం నాటికి 3.46 లక్షల యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,624 మంది చనిపోయారు.

 


తమకు ప్రభుత్వం నుంచి లిగల్‌ నోటిసు వచ్చిన వెంటనే ట్విట్టర్, లోకల్‌ రూల్స్‌పై ఆరాతీస్తున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఒకవేళ ఆ కంటెంట్‌ రూల్స్‌ను అతిక్రమించే విధంగా ఉంటే, వెంటనే తొలగిస్తామని అన్నారు. దాదాపు 50 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక ఎమ్మెల్యే, ఫిల్మ్‌మేకర్‌ ట్విట్‌ను ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలగించారు. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్కువ కంటెంట్‌ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ పోస్టులు ప్రజలు వారి ఆరోగ్యంపై భయాందోళనలు కలిగించే పరిస్థితిని ప్రోత్సహించేలా ఉందని తెలిసింది. కానీ, ఇటువంటి వార్తను ప్రచారం చేసిన వ్యక్తులకు సంబంధించిన వివరాలను అంత త్వరగా కనిపెట్టే పరిస్థితి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news