Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో పిటిషన్… రేపు విచారణ

-

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు విషయం చర్చనీయాంశం అవుతోంది. గత శుక్రవారం వారణాసి కోర్ట్ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతి ఇస్తూ కీలకమైన తీర్పు చెప్పింది. ఈ నెల 17 కోర్ట్ నియమించిన కమిషనర్ వీడియోగ్రఫీ చేసిన వివరాలను సమర్పించాలని వారణాసి కోర్ట్ ఆదేశించింది. దీంతో గత మూడు రోజుల నుంచి కాశీలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో బయట, లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు. అయితే దీనిపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతోంది. అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు కోర్ట్ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు. ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయామని… జ్ఞానవాపి మసీదును కోల్పోలేమంటూ వ్యాఖ్యానించారు అసదుద్దీన్.

ఇదిలా ఉంటే తాాజాగా జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వేపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై మే 17న సుప్రీంకోర్టు విచారించనుంది. అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ వేసిన పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news