బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. బంగారం అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సరే అక్రమార్కులు బంగారం అక్రమ రవాణా చేయడానికి శతవిధాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు, మహిళలు సైతం విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

బంగారం అక్రమ రవాణాని అడ్డుకునేందుకు కష్టమ్స్ అధికారులు ఎన్ని అడ్డుకట్టలు వేసినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద 2.4 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. 15 గోల్డ్ బిస్కెట్లను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. అనుమానం వచ్చిన కష్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బంగారం అక్రమ రవాణా గుట్టు బయటపడింది. దీంతో ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.